ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మక్కువ మండలంలోని చెముడు గ్రామంలో బోను.కృష్ణయ్య కు చెందిన ఆరు మేక పిల్లలపై కుక్కల గుంపు దాడి చేసి చంపేశాయి. గ్రామం ఆరు బయటలో ఉన్న మేకల శాలలో ఎప్పటిలాగే మేకలు మేపుకొని వచ్చిన కృష్ణయ్య .. మేకలను శాలలో పెట్టి (దడి) తడక పెట్టాడు. సోమవారం తెల్లవారుజామున శాలకు వచ్చి చూసేసరికి ఆరు మేకపిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో కృష్ణయ్య బోరున విలపించాడు. సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లడంతో ఆ కుటుంబం జీవనోపాధిని కోల్పోయామంటూ ... అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కృష్ణయ్య కుటుంబం వేడుకున్నారు.
Manyam - కుక్కల దాడిలో మేకపిల్లలు మృతి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)