గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు భారీ ర్యాలీ

1 గంట క్రితం

rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కురుపాం: ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కురుపాం మండల కేంద్రంలో సుమారు వెయ్యి మంది గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తుడుము డప్పుల మోతలు, నినాదాలతో గిరిజనులు ర్యాలీలో పాల్గొన్నారు. గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే జీవో నంబర్‌ 3, 1/70 చట్టం తదితర అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు, భూములు, ఉద్యోగాలు, విద్య, ఉపాధి వంటి అంశాల్లో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని కోరారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనేతరుల భూదురాక్రమణలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్