ప్రజాశక్తి - రామచంద్రపురం : రామచంద్రపురం మండల పరిషత్ ఉపాధ్యక్షులు శాఖ బాబి కి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతులమీదుగా సన్మానం జరిగింది. మండల పరిషత్ లో ఉపాధ్యక్షుడిగా ఐదేళ్లపాటు పనిచేసిన బాబి పదవి విరమణ సందర్భంగా బుధవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. రెండుసార్లు అన్నాయిపేట గ్రామం నుండి ఎంపీటీసీగా ఎంపిక కావటమే కాకుండా మండల ఉపాధ్యక్షులుగా పనిచేసి అందరి మన్ననలు పొందారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజా సేవ చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్, ఏఎంసీ చైర్మన్ అక్కల రీశ్వంత్ రాయ్, ఎంపీపీ అంబటి భవాని, ఉపాధ్యక్షులు నరాల రాజ్యలక్ష్మి, ఎంపీడీవో పద్మజ్యోతి, వైసీపీ మహిళా విభాగం నాయకులు ఎల్లమెల్లి సతీష్ కుమారీ, వైసీపీ పార్టీ నాయకులు పట్టా శ్రీనివాస్, పెంటపాటి శ్రీనివాసరావు, ద్రాక్షారామ సొసైటీ చైర్మన్ ముప్పనపల్లి గణేష్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మండల ఉపాధ్యక్షునికి మంత్రి సన్మానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)