బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Defamation case against Rahul Gandhi : విచారణ సెప్టెంబర్‌ 21కి వాయిదా

1 గంట క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూడిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీపై దాఖలైన పరువునష్టం కేసు విచారణను ఎంపి-ఎమ్మెల్యే కోర్టు సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది. ఫిర్యాదుదారు తరపున న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ కేసు విచారణను వాయిదా వేసినట్లు ప్రత్యేక జడ్జి శుభమ్‌ వర్మ బుధవారం తెలిపారు. గురువారం వివిధ కోర్టుల్లో మరికొన్ని కేసులు విచారణకు ఉన్నాయని, దీంతో అదనపు సమయం కావాలని బిజెపి నేత, ఫిర్యాదుదారు విజయ్‌ మిశ్రా తరపున న్యాయవాది సంతోష్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసేందుకు జడ్జి అంగీకరించారు. 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ విజయ్‌ మిశ్రా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్