ప్రజాశక్తి, విజయనగరం కోట : కూటమీ ప్రభుత్వంతోనే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం పట్టణంలో గల RS రెడ్డి కోచింగ్ సెంటర్ (గురజాడ గ్రంథాలయం ఎదురుగా) లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో బుధవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఎన్నో పరిశ్రమలను తీసుకువస్తూ వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించారని, మెగా డీఎస్సి పై వైసిపి పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. గత వైసిపి పాలనలో ఎపిపిఎస్సి ఉద్యోగాల నియామకాలలో అనేక అవకతవకలు జరిగినట్టు నిరూపితమైనదని అన్నారు. నారా లోకేష్ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుత కూటమి పాలనలో నిరుద్యోగులకు మెగా డీఎస్సి, పోలీసు శాఖలో అనేక నియామకాలు చేపట్టడమే కాకుండా జాబ్ కాలెండర్ ప్రకటించి, తదనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో వైసిపి పార్టీ వారు యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో యువత నమ్మకాన్ని నిలబెడుతూ పారదర్శకంగా, ప్రతిభ ఆధారిత నియామకాలు చేపట్టామని, ఇకపై కూడా అదేవిధంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ పరిశీలకులు పీవీజీ కుమార్ ,పట్టణ అధ్యక్షులు గంటా రవి, ప్రధాన కార్యదర్శి కోదండరాం, కుటుంబ రావు, తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే ఉద్యోగ అవకాశాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)