గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నదాతకు అవస్థలు

1 గంట క్రితం

rans
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తుఫాను ప్రభావంతో వరి రైతుల్లో ఆందోళన

- అకాల వర్షాలతో చేతికందే దశలో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం

ప్రజాశక్తి – గరుగుబిల్లి: గరుగుబిల్లి మండల పరిధిలో తుఫాను ప్రభావం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలో అధికంగా వరి సాగు చేపట్టిన రైతులకు అకాల వర్షాలతో అవస్థలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెట్టుబడులు పెట్టి, కూలీలతో పొలం పనులు చేయించి, రేయింబవళ్లు పంటను కాపాడుకుంటున్న రైతులకు తుఫాను రూపంలో ప్రకృతి పరీక్ష పెడుతోంది. అకాల వర్షాల కారణంగా వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉండటంతో పాటు, కోతకు సిద్ధంగా ఉన్న పంటకు నష్టం వాటిల్లుతుందేమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ధరల భారంతో సతమతమవుతున్న రైతులకు తుఫాను మరింత ఆందోళన కలిగిస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతుండటంతో రైతుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలవారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంట పరిస్థితిని పరిశీలించాలని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్