ప్రజాశక్తి అద్దంకి : గురువారం జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు చక్రధర్ బాబు మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలసి అద్దంకి రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దర్శి నియోజకవర్గ అదనపు నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలన అనంతరం పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టడం జరిగిందని తొలి విడుద సజావుగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అన్నారు. రెండో విడత నామినేషన్ ప్రక్రియ అద్దంకి ,దర్శి నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు నియోజకవర్గాలు కలిపి పది మండలాలలో 198 గ్రామపంచాయతీలు ఉన్నాయని వాటికి సంబంధించి 61 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతితో అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అదనపు నామినేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీలలో పార్టీలు ఉండవని , పార్టీలు బలపరిచిన వ్యక్తులు , ఇండిపెండెంట్ లు ఉంటారని ఆయన తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని దానిని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వెయ్యాలని అవసరం అయితే పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు గానీ నామినేషన్ వేసే అభ్యర్థులకు గాని ఎటువంటి అసౌకర్యం కలిగించిన ఉపేక్షించేది లేదని దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేసే దానిలో అభ్యర్థులు ఏదన్న ఇబ్బందులకు గురయ్య పరిస్థితి ఉంటే పోలీసులకు తెలిపి వారి సహకారంతో ప్రశాంత వాతావరణం లో నామినేషన్ వేయాలన్నారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై పలు రకాల కేసులు బనాయి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగాయని రెండవ విడత నామినేషన్లు ప్రక్రియ మొదలయ్యాయి అని ఆయన తెలిపారు. దర్శి నియోజకవర్గంలో కొన్ని చిన్నచిన్న ఘటన జరిగిన సందర్భంలో అదనపు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటుకు ఈసీ అనుమతి తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సహృద్భావ వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నామినేషన్ ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)