గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చైనా-అమెరికా సంబంధాలు మెరుగుపడ్డాయి : జిన్‌పింగ్‌

1 గంట క్రితం

China - US .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనా, అమెరికా మధ్య సంబంధాలు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గురువారం పేర్కొన్నారు. ఈ ఏడాది మూడోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన ముఖాముఖి భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో ప్రజలకు ప్రయోజనం చేకూరడంతోపాటు ప్రపంచంలో స్థిరత్వం పెరిగిందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగనున్న త్రైపాక్షిక చర్చలకు ముందు షెన్‌జెన్‌లో జిన్‌పింగ్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ట్రంప్‌లు ఉక్రెయిన్‌ యుద్ధం, ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్‌ సమావేశాలపై చర్చించారని క్రెమ్లిన్‌ సహాయకులు యూరి ఉషాకోవ్‌ వర్గాలు తెలిపాయి. షెన్‌జెన్‌లో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్‌) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన ఈ ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని అన్నారు. ఉక్రెయిన్‌, ఇరాన్‌ యుద్ధాలు, అణ్వాయుధ నియంత్రణ అంశాలు కూడా ముగ్గురు నేతల త్రైపాక్షిక భేటీలో చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్