ముంబయి : పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, 1993 ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకి చెందిన నివాస భవనాన్ని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గురువారం కూల్చివేయడం ప్రారంభించింది. దక్షిణ ముంబయిలోని భేండీ బజార్ పక్మోడియా వీధిలో ఉన్న హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా భవనాన్ని భారీ పోలీసు భద్రత నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని ప్రమాదకరమైనదిగా గుర్తించి సీ-1 కేటగిరీలో చేర్చినట్లు తెలిపారు. 1970వ దశకంలో దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో కలిసి ఈ భవనంలో నివసించారని అన్నారు. 1986లో భారత్ విడిచి పారిపోయే ముందు ఇదే అతడి తొలి స్థావరంగా ఉండేదని చెప్పారు.







కామెంట్‌లు (0)