సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రహదారికి గండి - ప్రజలకు తప్పని అవస్థలు

2 రోజుల క్రితం

Road washed away – Hardships inevitable for the public
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వీరఘట్టo (మన్యం) : మండలంలోని నడుకూరు కిమ్మీ గ్రామాల మధ్య ప్రధాన రహదారికి భారీగా గండి పడింది. తుఫాను ప్రభావం వలన గత 7 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా పైనుంచి వచ్చే వరద తాకిడికి తట్టుకోలేక రెండు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుకు భారీ గండి ఏర్పడింది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 24వ తేదీ రాత్రి కల్వర్టుకు చిన్న గండి పడడంతో రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు తక్షణమే స్పందించి ఈ రహదారి గుండా రాకపోకలు లేకుండా ఉండేందుకు ఇరువైపులా బారికేడులు ఏర్పాటు చేసి రవాణాన్ని నియంత్రించడంతోపాటు అక్కడ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. రహదారికి ఇరువైపు లఉన్న లంక పని మాధవ్, మజ్జి ముసలి నాయుడుకి పంట పొలాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. శుక్రవారం తహసిల్దారు వి రాజేశ్వరరావు, ఎస్ఐ ఎస్ షణ్ముఖరావు, రోడ్లు మరియు భవనాల శాఖ డి ఈ ఈ ఈశ్వరరావు గండి పడిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వరద తగ్గిన తర్వాత తాత్కాలిక పనులు చేపట్టి రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని డిఈఈ అన్నారు. గండి పడిన చోట స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేషన్ తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్