ప్రజాశక్తి - వీరఘట్టం : మండలంలో గత రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా గదభ వలస, బల్ల గుడ్డు, బట్టిగూడ, డిపి వలస, రాయిమానుగూడ, బిటివాడ, ఎం.వి.పురం తదితర గ్రామీణ ప్రాంతాల రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. ఈరహదారులపై ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారినా , పాలకులు మారినా నేటికీ గ్రామీణ ప్రాంతాల రహదారుల పరిస్థితి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చిత్తడిగా మారిన గ్రామీణ రహదారులు
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)