మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మన్యం బంద్‌ను జయప్రదం చేయాలి

06 ఆగస్టు, 2026

manyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆదివాసీ గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు పిలుపు

ప్రజాశక్తి - కురుపాం : గిరిజనుల హక్కులు, ఉపాధి అవకాశాలు, భూముల పరిరక్షణ కోసం ఆగస్టు 8న చేపట్టనున్న మన్యం బంద్‌ను గిరిజనులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా గురువారం నీలకంఠాపురం నుంచి మొండెంఖల్‌, గుమ్మలక్ష్మీపురం మీదుగా కురుపాం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు 100 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్‌ 3 రద్దయిన నేపథ్యంలో గిరిజన యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. జీవో నంబర్‌ 3కు ప్రత్యామ్నాయ ఉత్తర్వులు తీసుకురావడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి స్థానిక గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే గిరిజనుల భూములకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఆగస్టు 8 మన్యం బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి గిరిజన గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, యువత, విద్యార్థులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ బైక్‌ ర్యాలీలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మండంగి శ్రీనివాస్‌, మండంగి సన్యాసి, గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షులు బిడ్డక ప్రకాష్‌, అనిల్‌, గంగారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్