ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు బైక్ లు - ఇద్దరికి తీవ్రగాయాలు

5 రోజుల క్రితం

Two bikes collide head on two people sustain serious injuries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కురుపాం (మన్యం) : ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం మన్యంలోని కురుపాం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ... కురుపాం మండలం ఆఫీసియల్ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు కొండగొర్రి పాపారావు ఈరోజు రామభద్రపురం పాఠశాలకు వెళ్తుండగా, జియ్యమ్మవలస మండలం పెదదొర్జ గ్రామానికి చెందిన ఆరిక యేసుబాబు కురుపాంకు వస్తున్నారు. ఈ క్రమంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపంలో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్