శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు

53 నిమిషాల క్రితం

Two youths missing in pond
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొమరాడ (మన్యం) : ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖపట్నం కు చెందిన ఐదుగురు యువకులు గ్రామంలో తెలిసిన ఒకరు చనిపోవడంతో పరామర్శకు వచ్చారు. కొమరాడ మండలం మార్కొండ పూట్టి గ్రామ సమీపంలో వ్యక్తి దహన సంస్కారాల కోసం వచ్చిన ఆ యువకులు ప్రమాదవశాత్తు చెరువు వద్ద జారిపడి మునిగిపోయారు. వారిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి వివరాలు తెలియవలసి ఉంది. యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్