బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మన్యంలో మంచు అందాలు.. పర్యాటకులకు కనువిందు

1 గంట క్రితం

మన్యంలో మంచు అందాలు.. 
పర్యాటకులకు కనువిందు
రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, అందుకు భిన్నంగా మన్యంలో చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే చలి ప్రభావం కనిపిస్తోంది. గత వారం రోజులుగా పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతుండగా, రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతున్నట్లు చింతపల్లిలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చింతపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలుముకున్న మంచు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేసింది. కొండలు, లోయలను కప్పేసిన మంచు తెరలు కనువిందు చేశాయి. పచ్చని కొండల మధ్య పరుచుకున్న మంచు దుప్పటి మన్యానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణంతో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్