ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరి ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 వేల తక్షణ సాయం: కలెక్టర్

7 గంటల క్రితం

Collector Dinesh Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–రాజవొమ్మంగి: గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులు ప్రమాదవశాత్తు మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటన అత్యంత విషాదకరమని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలతో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన 10 మంది గిరిజనులు రెండు బృందాలుగా చేపల వేటకు వెళ్లగా, ఒక బృందంలోని ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందగా, మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున తక్షణ సాయంగా రూ.25 వేల చొప్పున అందజేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వ పరిహారం కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాయని, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. వర్షాకాలంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున గిరిజనులు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్