గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

25 దళిత కాలనీల్లో వివక్షత : 4 న, 7 న ఆందోళనలు

02 ఆగస్టు, 2026

25 దళిత కాలనీల్లో వివక్షత : 4 న, 7 న ఆందోళనలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 02:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–ఒంగోలు సిటీ (ప్రకాశం) : ఒంగోలు నగరంలోని 25 దళిత కాలనీల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్య, గృహస్థలాలు తదితర అంశాల్లో తీవ్ర వివక్షత కొనసాగుతోందని కెవిపిఎస్, సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, ఆవాజ్ తదితర ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. గత నెల 16 నుంచి 26 వరకు నిర్వహించిన 'సామాజిక శంఖారావం' సర్వేలో ఈ అంశాలు వెలుగుచూశాయని తెలిపారు. ఆదివారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దళిత కాలనీల్లో తాగునీటి సరఫరా, పౌర సదుపాయాలు, విద్య, గృహస్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న మున్సిపల్ కార్యాలయం వద్ద, 7న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఆవాజ్ నాయకుడు సయ్యద్ హుస్సేన్, సీఐటీయూ కో-కన్వీనర్ బి.వి.రావు, డివైఎఫ్ఐ నగర అధ్యక్షుడు పి.కిరణ్, కెవిపిఎస్ నాయకుడు ఎద్దు రవికుమార్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్