శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారులకు తక్షణ సాయంగా నిత్యవసర సరుకులు

18 నవంబర్, 2026

prakasam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 11:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది: కలెక్టర్ పి.రాజబాబు.

- జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

ప్రజాశక్తి - కొత్తపట్నం : ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం సముద్రతీరంలో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారుల వలలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన మత్స్యకారులకు నిత్యావసర సరుకులు సైక్లోన్ సందర్భంగా ఇచ్చే సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన వలలు విషయంలో అంచనా వేయవలసి ఉందని కాల పరిమితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియవలసిందని సమగ్ర విచారణ జరిపే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి చుట్ట చేయడం అల్లా అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు అన్నారు. వాస్తవాలు తెలుసుకోవలసి ఉందన్నారు. మత్స్యకారులు వలన దాచుకునే బిల్డింగ్స్ పూర్తిగా దెబ్బతిన్నందున వాటిని పునరుద్ధరణకై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రకాల సహాయాన్ని అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని దీనిపై సమగ్ర విచారణ చేపట్ట సమగ్ర విచారణ జరపవలసి ఉందని సంబంధిత పోలీస్ సూపరిండెంట్ కు సూచించడం జరిగింది అన్నారు. ప్రభుత్వం నుంచి అందవలసిన అన్ని రకాల సాయం అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో పలు విషయాలను అడిగి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..

సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ, ఒంగోలు శాసనసభ్యులు

కొత్తపట్నం పల్లిపాలెంలో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పరిశీలించడం జరిగింది. సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలా ఘోర అగ్నిప్రమాదం సంబంధించిన దీనికి కారకులైన వారిని పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రెవిన్యూ యంత్రాంగం అందరం రావడం జరిగిందని తెలియజేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మత్స్యకారుల వలలు అగ్నికి ఆహుతి అవడం చాలా బాధాకరమని తెలియజేశారు. గాలి ఎక్కువగా లేకపోవడం చేత చాలా వరకు నష్టం తగ్గిందని లేకుంటే పల్లిపాలెం తీవ్ర నష్టానికి గురి అయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను కారణంగా వలను జాగ్రత్త చేసుకునే దానికి షెడ్లలో దాచి పెట్టడం జరిగిందని ప్రమాదవశాత్తు అగ్నికి గురి అవ్వటం జరిగిందని తెలియజేశారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని రెవెన్యూ పోలీస్ ఎంత రంగానికి తెలిపారు. నష్టపోయిన మత్స్యకారులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంఘటనా స్థలాన్ని చేరుకొని మత్స్యకారుల ఆవేదనను ప్రత్యక్షంగా పరిశీలించటం జరిగింది. నష్టపోయిన వారిని ఓదార్పు చేయడం జరిగింది. వీరి వెంట ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, శ్రీనివాసరావు, రెవిన్యూ సిబ్బంది మత్యశాఖ, సిబ్బంది విద్యుత్ శాఖ, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్