ప్రజాశక్తి - శిoగరాయకొండ (ప్రకాశం) : మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను శిoగరాయకొండలో హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది. శిoగరాయకొండ ఎస్సై లేళ్ళ సుధీర్ కుమార్ ఆయన నివాసానికి వెళ్లి నోటీసును అందజేసి నామినేషన్ కార్యక్రమానికి రాకూడదని, మర్రిపూడి మండలంలో సోమవారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ... జరిగిన నామినేషన్ల ఘర్షణల నేపథ్యంలో ఆదిమూలపు సురేష్ కూ నోటీసు అందజేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ... పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
మాజీ మంత్రి వైసిపి కొండపి ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ హౌస్ అరెస్ట్
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)