శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ యాప్ ను వినియోగించుకోండి

1 గంట క్రితం

ఆర్. సుశీల

ఆర్. సుశీల

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి ఒంగోలు కలెక్టరేట్
సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు, తక్కువ వ్యయం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ యాప్ ను వినియోగించుకోవాలని ఉప రవాణా కమిషనర్ ఆర్. సుశీల సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను
దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, సరుకు రవాణాను మరింత సులభం, వేగవంతం మరియు తక్కువ వ్యయంతో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పి ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ డిజిటల్ యాప్ ను ప్రవేశపెడుతోందన్నారు.ఈ యాప్ ద్వారా రైతులు, వ్యాపారులు, రవాణాదారులు, ప్రైట్ ఫార్వర్డర్లు (సరుకు రవాణాను సమన్వయం చేసి, బుకింగ్, పత్రాల నిర్వహణ, ట్రాకింగ్ వంటి సేవలు అందించే సంస్థలు లేదా వ్యక్తులు), డ్రైవర్లు ఒకే వేదికపైకి రావడం ద్వారా సరుకు రవాణా మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. ఫలితంగా వాహనాల వినియోగం పెరగడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గి, మార్కెట్ అనుసంధానం మెరుగుపడుతుంది.

యాప్ ముఖ్య ప్రయోజనాలు:

- డ్రైవర్లు, వాహనాలు మరియు రవాణాదారుల డిజిటల్ నమోదు.

- డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, ఫిట్నెస్ (ఎఫ్ సి), పి యు సి వంటి చట్టబద్ద పత్రాల ధృవీకరణ.

- ట్రాఫిక్ పరిస్థితులు, ఇంధన వ్యయం, టోల్ చార్జీల ఆధారంగా అత్యుత్తమ మార్గాల సూచన.

- రిటర్న్ లోడ్లను అనుసంధానం చేసి ఖాళీ ప్రయాణాలను తగ్గించడం,

- రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల ద్వారా సరుకు రవాణాకు రియల్-టైమ్ ట్రాకింగ్ సౌకర్యం.
- - మొబైల్ ట్రాకింగ్, టెలిమాటిక్స్ ,ఫాస్టాగ్ ఆధారిత వాహన పర్యవేక్షణ.

- ధృవీకరించబడిన డ్రైవర్ల వివరాలను ప్రాంతాల వారీగా శోధించే సౌకర్యం.

- ట్రక్కులు , ఫ్లీట్ నిర్వహణకు ఆధునిక మేనేజ్మెంట్ సేవలు.

- రవాణా స్థితి(జి పి ఎస్), వ్యయాలు, మౌలిక సదుపాయాల వినియోగంపై తక్షణ నివేదికలు , విశ్లేషణలు.

- వాహన యజమాని భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా వాణిజ్య లేదా ప్రకటనల ప్రయోజనాల కోసం ఇతరులకు అనుసంధానించరు.
- వినియోగదారుల డేటా భద్రత మరియు గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం.
ఈ యాప్ ను ప్రధానంగా వాహన యజమానులు, రవాణాదారులు మ డ్రైవర్ల సౌలభ్యం కోసం రూపొందించారన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రతి రవాణాదారు ఈ యాప్ లో నమోదు చేసుకుని, సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్