శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్‌

6 రోజుల క్రితం

pvr.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పటిష్ట భద్రత.. కలెక్టరేట్‌ నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణ

ప్రజాశక్తి – ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆదివారం ఉదయం పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కలెక్టరేట్‌ నుంచి అధికారులు లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లు ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు ధ్రువీకరణ కోసం ఎన్నికల సంఘం ఆమోదించిన 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్