శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ విధానాన్ని రద్దుకు ప్లేయర్స్ మద్దతు

1 గంట క్రితం

sklm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ బంద్ పిలుపునకు సంఘీభావం

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, జాతీయ ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్యు, ఇతర విద్యార్థి సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపునకు ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో సాధన చేస్తున్న క్రీడాకారులు మద్దతు ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బండి వీరస్వామి క్రీడాకారులకు బంద్ లక్ష్యాలను వివరించగా, నీట్ రద్దు, జాతీయ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని ప్లేయర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, నీట్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్