గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పనిలో అలసత్వం పేరుతో రైడర్‌ను విధుల నుంచి తొలగింపు

02 ఆగస్టు, 2026

Rider removed from duty for negligence at work.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–ఒంగోలు సిటీ (ప్రకాశం) : ఒంగోలు కొత్త మార్కెట్‌లోని బ్లింకిట్ గిగ్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఒక కస్టమర్‌కు పంపిన పూల మొక్క నాసిరకంగా ఉందంటూ కస్టమర్ ఆర్డర్‌ను తిరస్కరించగా, ఆ ఘటనకు డెలివరీ రైడర్ రఘుబాబును బాధ్యుడిగా చేస్తూ యాజమాన్యం అతని విధులను నిలిపివేసిందని కార్మికులు ఆరోపించారు. డెలివరీ చేసే వస్తువుల నాణ్యతపై రైడర్‌కు ఎలాంటి బాధ్యత ఉండదని, గిడ్డంగి నుంచి ఇచ్చిన వస్తువునే కస్టమర్‌కు అందజేస్తాడని కార్మికులు పేర్కొన్నారు. యాజమాన్యం ఏకపక్షంగా రైడర్‌పై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకుని రఘుబాబును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లింకిట్ కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. సంఘ నగర కన్వీనర్ టి మహేష్, బివి రావు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గిగ్ కార్మికులపై ఇలాంటి ఏకపక్ష చర్యలు నిలిపివేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కార్మికులు హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్