గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకల జిల్లా పరిషత్ హై స్కూల్లో నిలిచిన ఎస్ఎంసి ఎన్నికలు

53 నిమిషాల క్రితం

prakasam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలుగుదేశం వైసీపీ మధ్య పోటా పోటీ

కోరం లేక ఆగిన ఎన్నిక

మండలంలో మిగిలిన 48 పాఠశాలల్లో అన్ని ఏకగ్రీం

ప్రజాశక్తి - శింగరాయకొండ : శింగరాయకొండ మండలంలోని 49 పాఠశాలలకు గాను ఎస్ఎంసి ఎన్నికల్లో 48 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయి. పాకాల జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనడంతో గురువారం ఎన్నిక నిలిచింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పోటీ ఉదృతంగా ఉండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసుల రంగంలోకి దిగారు. ఎస్ఐ లేళ్ళ సుధీర్ కుమార్ తమ సిబ్బందితో అక్కడే బందోబస్తు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఉపాధ్యాయులు ప్రసాద్ కోరం లేదని ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్