శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొదిలిలో ఉద్రిక్తత..

22 అక్టోబర్, 2026

ycp.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఒంగోలు–కర్నూలు రహదారిపై వైసిపి నేత అన్నా రాంబాబు బైఠాయింపు

ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా తమకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు–కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు సమూహంగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో అభ్యర్థులు నామినేషన్ వేసి తిరిగి వచ్చే వరకు పోలీసులు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద తమకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని వారు కోరారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నామినేషన్ కేంద్రం వద్ద అనుమతులు ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా సమూహంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. నిబంధనల మేరకు సహకరించాలని పోలీసులు వైసిపి నాయకులను కోరారు. దాదాపు గంటకు పైగా అన్నా రాంబాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పొదిలిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్