సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విబి గ్రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి : వ్య.కా. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.మోజెస్

1 గంట క్రితం

The VB Granje Act must be repealed: V. Moses, District Vice-President of the Agricultural Workers' Union.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం) : ఉపాధి హామీ పథకం పనిని పాత పద్దతిలోనే కొనసాగించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో టంగుటూరు మండలంలోని నిడమానూరు గ్రామంలో పని ప్రదేశంలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ .... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబి జి గ్రాంజి పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపుతూ, పేదల పొట్ట కొట్టే విదంగా ఉన్నదని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులతో ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించారు అని తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించిన తరువాత మిగిలిన 60 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది అని తెలిపారు. కొత్తగా వచ్చిన విబి జి గ్రాంజి చట్టం వల్ల రాష్ట ప్రభుత్వాలు ఈ పథకానికి అయ్యే 40 శాతం నిధులు ఖర్చు పెట్టె స్థితిలో లేవు, కాబట్టి ఈ కరువు పని కాస్త పేదలకు దూరం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ కొత్త చట్టాన్ని రద్దు చేసి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లోనే కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుకి 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేసారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్