బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు రెండు కౌంటింగ్ కేంద్రాలు

23 గంటల క్రితం

Two counting centers for MPTC and ZPTC elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పేస్, క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీల ఎంపిక

  • స్ట్రాంగ్ రూములు కూడా ఇక్కడే


ప్రకాశం : ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సెంటర్లను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు నిర్ణయించారు. ఒంగోలు నగర శివారులోని పేస్, క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కౌంటింగ్ కేంద్రాల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ.అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేయడంతో జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి ఈ కాలేజీలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. స్ట్రాంగ్ రూములను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. అన్ని మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లను ఈ కాలేజీలలో భద్రపరుస్తారు. వీటికి సంబంధించిన కేటాయింపు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వారి వెంట జడ్పి సీఈవో చిరంజీవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్