గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యర్థాల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి : కలెక్టర్

31 జులై, 2026

వ్యర్థాల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి : కలెక్టర్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు నగర శివారులోని గుత్తికొండవారిపాలెం వ్యర్థాల డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం డంపింగ్ యార్డును పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పేరుకుపోయిన 2.56 లక్షల టన్నుల వ్యర్థాల్లో 1.76 లక్షల టన్నులను ప్రాసెస్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రాసెసింగ్ ద్వారా లభించే ఆర్‌డీఎఫ్‌ను సిమెంట్ పరిశ్రమలకు, ఇనర్ట్ మెటీరియల్‌ను లోతట్టు ప్రాంతాల పూడికకు, బయో సాయిల్‌ను ఎరువులుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్ నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజల్లో అవగాహన పెంచాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దుష్పరిణామాలపై ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు...


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్