ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుఇఇయు ఎపిసిపిడిసిఎల్‌ మహాసభలను జయప్రదం చేయాలి

12 నవంబర్, 2026

యుఇఇయు ఎపిసిపిడిసిఎల్‌ మహాసభలను జయప్రదం చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ నెల 15న ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం సర్కిల్‌ యూటీఎఫ్‌ భవన్‌లో జరిగే యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యుఇఇయు-సీఐటీయూ) ఎపిసిపిడిసిఎల్‌ రెండో మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్‌ డిస్కం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎల్‌. రాజు, గౌరవాధ్యక్షులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సి.హెచ్‌. శ్రీనివాస్‌ కోరారు. మహాసభల పోస్టర్‌ను గురువారం విజయవాడలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అమరావతి సర్కిల్‌లోని సీఆర్‌డీఏ ప్రాంతాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, ఉద్యోగులపై పనిభారం పెంచే విధానాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. గత పీఆర్సీలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని మెరుగైన ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని కోరారు. వెయిటేజీ ఇంక్రిమెంట్లను పునరుద్ధరించాలని, టాటా ఏఐజీ మెడికల్‌ పాలసీని రద్దు చేసి మెరుగైన అన్‌లిమిటెడ్‌ వైద్య బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడంతోపాటు ఈపీఎఫ్‌, హయ్యర్‌ పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేసి నేరుగా వేతనాలు చెల్లించాలని, కన్వర్షన్‌ ద్వారా జేఎల్‌ఎంగా మారిన గ్రేడ్‌-2 కార్మికులకు ఏఎల్‌ఎం పదోన్నతులు కల్పించాలని కోరారు. డిస్కం పరిధిలోని ఆరు జిల్లాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె. నాగేశ్వరరావు, వి.బి. కోటేశ్వరరావు, సురేష్‌, షేక్‌ దరియావలి, షేక్‌ అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్