శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గూడూరు లో బంద్ విజయవంతం

1 గంట క్రితం

Bandh successful in Gudur.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూసివేత


ప్రజాశక్తి - గూడూరు టౌన్ (నెల్లూరు) : ఢిల్లీలో విద్యార్థులు, యువత పై జరిగిన దాడిని నిరసిస్తూ .... గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కలశాల నందు ఏ. ఐ.ఎస్. ఎఫ్, పి.డి.ఎస్. యు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ .... నీట్ పేపర్ లీకేజీ తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారిందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులు , యువత పై దాడి చేసిన వారి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యా సంస్థల బంద్ సందర్భంగా పలు పాఠశాలలు , కళాశాలలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో ఏ. ఐ ఎస్. ఎఫ్ నాయకులు శశి, సునీల్ , యశ్వంత్, రిజ్వాన్, పి.డి. ఎస్ . యు నాయకులు సునీల్, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్