నెల్లూరు : మైనారిటీ గురుకుల పాఠశాలను త్వరగా పూర్తి చేయాలని, వక్ఫ్ భూములకు సూచికలు ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రఫి, జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాల పని 2017లో ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పని కాలేదన్నారు. 5 జిల్లా లకు ఓఖటే బాలుర గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ మైనారిటీ గురుకుల పాఠశాల మాత్రం ప్రభుత్వాలు పని పూర్తి చేయడంలో వెనకడుగు వేస్తున్నాయన్నారు. జిల్లా లో వక్ఫ్ బోర్డు భూములను జరిగిన తర్వాత కోర్టుల చుట్టూ తిరిగిన కోర్టులు కూడా అనుభవదారులకి ఇచ్చిన సంఘటన నెల్లూరు నగరంలో జరిగినందున వక్ఫ్ భూములన్నిటికీ కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే కొంతమేర ఆక్రమణలు తగ్గించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాబోవు రోజుల్లో మైనారిటీల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి P. యస్దాని బాషా, ఉపాధ్యక్షులు ఎస్ఎం భాష, షేక్ జానీ భాష,కోశాధికారి మహమ్మద్ సర్దార్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ చాన్ బాషా, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ గురుకుల పాఠశాలను త్వరగా పూర్తి చేయాలి : ఆవాజ్ జిల్లా కమిటీ
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)