రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రెండు పతకాలు సాధించి ప్రతిభ చాటిన ఎన్‌బిఎం న్యాయ కళాశాల విద్యార్థి వి.భవానీ ప్రసాద్‌కు కళాశాలలో ఘనంగా సత్కరించారు. నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన 46వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హ్యామర్ త్రోలో 45.20 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం, డిస్కస్ త్రోలో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల డీన్ డివి.రమణ, ప్రిన్సిపల్ బి.గాయత్రి, అధ్యాపకుడు దయాసాగర్ భవానీ ప్రసాద్‌ను అభినందించి, పతకాలు అలంకరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని, క్రమశిక్షణ, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వచ్చే ఏడాది జనవరి 8, 9, 10 తేదీల్లో నాగపూర్‌లో జరగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ భవానీ ప్రసాద్ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని కళాశాల అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)