ప్రజాశక్తి - మెళియాపుట్టి: స్థానిక శాఖాగ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి ఆర్.అనురాధ ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు తహశీల్దార్ కె.రాము బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వైకుంఠరావు, జెడ్‌పి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, డ్రాయింగ్, పీటీ ఉపాధ్యాయులు, నలంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ప్రతాప్, ఉపాధ్యాయులు నీలిమ, స్వాతి, శారద, జెజిబివి ఉపాధ్యాయులు, పాఠకులు పవన్, మణి, లక్ష్మీపతి, సహాయకురాలు హేమలత పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)