శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు అఖిల్ ఎంపిక

20 నవంబర్, 2026

రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు అఖిల్ ఎంపిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి– బూర్జ : మండలం కె.కె. రాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.అఖిల్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 7న శ్రీకాకుళంలోని ఇంద్రనగర్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీఎస్ స్విమ్మింగ్ పూల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అఖిల్ బయలుదేరినట్లు పాఠశాల హెచ్ఎం వై.మాలతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమన్నారు. అఖిల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుజాత, ఈది అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్