ప్రజాశక్తి- బూర్జ : వాతావరణ శాఖ ఆక్వాన్ తుపాను హెచ్చరికతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులను వర్షం బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కోసిన పంటను హుటాహుటిన కుప్పలుగా వేసి, వాటిపై టార్పాలిన్ (పట్టా) కవర్లు కప్పుతున్నారు. మరోవైపు నూర్పిడి పూర్తయిన ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉండటంతో ధాన్యాన్ని సైతం హడావుడిగా బస్తాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతాలకు, ఇళ్లకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఆకాశం మెఘావృతమై ఉండడమే కాకుండా మధ్యాహ్నం చిన్నపాటి జల్లులు పడడంతో రైతులు ధాన్యాన్ని రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఫోటో: టార్ఫిలిన్లు కప్పుతున్న రైతులు







కామెంట్‌లు (0)