ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్‌ అరెస్ట్‌

1 గంట క్రితం

darsi.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దర్శిలో వైసీపీ నామినేషన్లపై ఉత్కంఠ

ప్రజాశక్తి–దర్శి: దర్శిలో వైసీపీ నామినేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శనివారం వైసీపీ నామినేషన్‌ పత్రాలను టీడీపీ నేతలు చించివేశారని ఆరోపణలు వచ్చాయి. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పరిణామాలతో దర్శిలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్