శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రణాళికాబద్ధంగా చదవాలి

20 నవంబర్, 2026

ప్రణాళికాబద్ధంగా చదవాఇ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- నందిగాం: మిషన్ మార్చ్ కార్యక్రమం అమల్లో భాగంగా పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలను సాధించాలని ఎంఇఒ అన్నపురం చిన్నారావు అన్నారు. మండలంలోని లక్కిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కురమన దాలయ్యతో పాఠశాల ప్రగతిపై చర్చించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు ఫలితాలు మెరుగుకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన వివిధ రకాల అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తులసీప్రసాద్, నాగేశ్వరరావుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్