ప్రజాశక్తి పలాస : భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే అమెరికా భారత్ స్వేచ్చ వాణిజ్య ఒప్పంధం రద్దు చేయాలని వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిరసనలో బాగంగా కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు తెప్పల అజయ్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు వంకల మాధవరావు, ఎ ఐ కె యం నాయకులు మద్దిలి రామారావు, ఎపి రైతు సంఘం నాయకులు వంకల ముకుంద రావు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి యన్ గణపతి ఎ ఐ సి సి టి యు నాయకులు పి నాగేశ్వరావు పి ఓ డబ్ల్యూ నాయకులు పి కుసుమ తదితరులు మాట్లాడుతూ అమెరికా ట్రంప్ కు గులాంగిరి చేస్తూ మోడీ భారత దేశాన్ని, రైతులను, కార్మికులను ప్రజలను సంక్షోభంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్చ వాణిజ్య ఒప్పందమని కుదుర్చుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒప్పంధం వల్ల భారత రైతు కుదేలై ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన పంట తాను అమ్ముకోలేక, గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డుపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విధేశి పంటలపై సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతులు పంటలు పారబోయడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. కార్మిక చట్టాలు మార్చేసి లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను కట్టు భానిసలుగా మార్చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. భారత్ మాతాకి జై అని ప్రతి మాట ముందు చెప్పే మోడీ జై కొట్టడానికి ఏమీ మిగిల్చారని విమర్శించారు. ఇప్పటికైనా వాణిజ్య ఒప్పంధం రద్దు చేసి ప్రజానుకూల విధానాలు అమలు చేసి భారత రైతంగాన్ని, ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎంపళ్ళ కామేశ్వరరావు బి ప్రసాదరావు,కె బాలాజీ రావు, కె హేమసూదన్, సోమేశ్వరరావు భీమారావు, కె లోకనాధం బి స్వాతి, యం వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అమెరికా భారత్ స్వేచ్చ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 11:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)