ప్రజాశక్తి- కవిటి : మండలంలోని సహాలాలపుట్టుగలో శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో ఐదు ఇళ్లలో విద్యుత్ లైన్లు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. గోనియా భరత్, ఎర్ర పరమ్, ఎర్ర చందనమణి, ఎర్ర భాస్కర్, మద్య గణపతి ఇళ్లలో విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ కల్యాణ్ చక్రవర్తి, ఎస్‌ఐ రవివర్మ, విఆర్ఒ వజ్జ గిరిబాబు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పిడుగుపాటు ఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, నష్టానికి సంబంధించిన వివరాలు, ఆధారాలను సేకరించారు.








కామెంట్‌లు (0)