ప్రజాశక్తి- టెక్కలి : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా నూతన కార్యవర్గం సోమవారం ఎంపికైంది. ఈ ఎంపికలో జిల్లా అధ్యక్షునిగా ఉత్తరవల్లి మురళీమోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా టెక్కలికి చెందిన న్యాయవాది దివ్వల వివేకానందలు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా కె.అన్నంనాయుడు, ఎం.సత్యనారాయణ, పి.వెంకటరావు, ఎం.లక్ష్మీనారాయన, సంయుక్త కార్యదర్శిగా ఎ.ఉమామహేశ్వరరావు, నాగరాజు పాత్రో, ఎ.కె.వి.ప్రసాద్, డి.భవాని ప్రసాద్, కోశాధికారిగా పద్మలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వివేకానంద తెలిపారు.







కామెంట్‌లు (0)