ప్రజాశక్తి- టెక్కలి: టెక్కలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వరద నీరు గురువారం నాడు చేరుకొంది. గడచిన రెండున్నర రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు భాగంగా మోకాళ్ళ లోతు నీరూ చేరగా కార్యాలయంలోకి నీరు ప్రవేశించింది. దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన సబ్ రిజిస్టర్ కార్యాలయం పాత భవనంలోకి నీరు చేరుకోవడం వల్ల రికార్డులు తడిచిపోతాయేమో నన్న ఆందోళన ఉద్యోగస్తులు, స్టాంపు వండర్స్ వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుత సబ్ రిజిస్టర్ కార్యాలయం పురాతన భవనం కావడంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని ఉద్యోగస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి కార్యాలయానికి నూతన భవనం మంజూరు చేయాలని స్టాంప్ వెండర్స్ ఉద్యోగస్తులు స్థానికులు కోరుతున్నారు.
రిజిస్టర్ కార్యాలయంలోకి వరద నీరు
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)