బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భద్రత, నాణ్యతపై అవగాహన అవసరం

1 గంట క్రితం

భద్రత, నాణ్యతపై అవగాహన అవసరం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పలాస

నాణ్యత, భద్రత, విశ్వసనీయత కలిగిన వస్తువులను వినియోగించడం ప్రతి వినియోగదారుడి హక్కు అని జిల్లా వినియోగదారుల క్లబ్‌ల మాస్టర్ ట్రైనర్, బిఐఎస్ క్లబ్ మెంటార్ ఎల్.వెంకటాచలం అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం మాట్లాడారు. నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులపై ఎస్ఐఎస్ గుర్తు, బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సంబంధిత ప్రమాణాల గుర్తులను పరిశీలించి కొనుగోలు చేయాలని విద్యార్థులు, యువత, వినియోగదారులకు సూచించారు. ప్రమాణాలు ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడటంతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. ఏటా అక్టోబరు 14న ప్రమాణాలపైన ప్రజల్లో అవగాహన చైతన్యం కోసం ప్రపంచ ప్రమాణాల దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు తమ ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో ప్రమాణాలపై అవగాహన కల్పించి నాణ్యమైన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారత ప్రమాణాల సంస్థ బిఐఎస్ కేర్ యాప్ ద్వారా కూడా సదరు వస్తువుల నాణ్యత ప్రమాణాల భద్రతలను వినియోగదారులు తెలుసుకోవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్