నార్పల : గ్రంథాలయ ఛైర్మన్, కార్యదర్శి నార్పల శాఖా గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. వాటిని స్థానిక గ్రంథాలయంలో రిటైర్డ్ కండక్టర్, సామాజిక సేవా కార్యకర్త ప్రసాద్, సీనియర్ పాత్రికేయుడు లక్ష్మీనారాయణ, వెంకటేశులు, కోనారెడ్డి, బాషా ఆవిష్కరించారు. గ్రంథాలయ అధికారి కావేరి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ పరీక్షలు, బ్యాంకింగ్, గ్రూప్-1, గ్రూప్-2, కానిస్టేబుల్, తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడే నూతన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.
నార్పల గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాల ఆవిష్కరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)