బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పశ్చిమ యెమెన్‌లోని చమురు కేంద్రాలపై సౌదీ దాడులు

1 గంట క్రితం

Saudi coalition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సనా : రాజధాని సనా సహా పశ్చిమ యెమెన్‌ వ్యాప్తంగా ఉన్న చమురు కేంద్రాలపై సౌదీ అరేబియా దాడులకు దిగింది. యెమెన్‌లోని సనా, పశ్చిమ ప్రావిన్సులైన ధమర్‌, సాదాలలో దాడులు చేపట్టినట్లు సౌదీ సంకీర్ణ కూటమి ప్రతినిధి తుర్కీ అల్‌-మాలిక్‌ మంగళవారం ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. యెమెన్‌, దక్ష‍ిణ ఎర్ర సముద్రం, జలమార్గాలను బెదిరించేందుకు, హౌతీలు యుద్ధం చేసేందుకు ఆయుధాలను సరఫరా చేసే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. జులైలో యుద్ధం చెలరేగినప్పటి నుండి యెమెన్ రాజధానిలో సంకీర్ణ దళాలు మొదటిసారిగా ప్రజలను ఖాళీ చేయించే ఉత్తర్వులను జారీ చేశాయి. ఆ తర్వాత సనా శివార్లలోని యెమెన్ పెట్రోలియం కంపెనీ కేంద్రంపై దాడి చేశాయి.


రాజధాని రియాద్‌ సహా తూర్పు సౌదీ అరేబియాలోని ఆరామ్‌కోలో పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష‍సాక్ష‍ులు, మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. రియాద్‌ సహా పలు ప్రాంతాలపై హౌతీలు క్ష‍ిపణులను ప్రయోగించినట్లు సౌదీ అరేబియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆరామ్‌కో ప్రధానకార్యాలయం ఉన్న దహ్రాన్‌లోని నివాస ప్రాంతంలో శిథిలాలు పడ్డాయని పేర్కొంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్