బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘పింఛన్ల పేరిట ప్రభుత్వం మోసం’

1 గంట క్రితం

‘పింఛన్ల పేరిట ప్రభుత్వం మోసం’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట

పింఛనుదారులకు అక్టోబరులో తీపికబురు చెబుతామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా ఎన్నికలకు సిద్ధమైందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ విమర్శించారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు నానా తంటాలు పడ్డారని, ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొన్నారని చెప్పారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌‌ను రద్దు చేస్తామని కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు చెప్పినా దాని గురించీ అధికారులు మాట్లాడకపోవడం సరికాదని అన్నారు. ఈ అంశాలపై ఎన్నికల్లో నాయకులను ప్రజలు అడగాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్