బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార కల్తీకి అడ్డుకట్ట

1 గంట క్రితం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార కల్తీకి అడ్డుకట్ట image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మధురవాడ

ఆహార కల్తీ ముప్పు నివారణకు, ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఆధునాతన ల్యాబ్, కృత్రిమ మేధ, డిఎన్‌ఎ మార్కర్‌ ‌వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేశారు. బుధవారం గీతం వర్సిటీలో ‘సుస్థిర, పోషకాహర భవిష్యత్తు కోసం వినూత్న ఆహర వ్యవస్థలు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. గీతం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆహర భద్రత, ప్రామాణికత, సుస్థిర ఆహర ప్రొసెసింగ్ సాంకేతికతలలో వస్తున్న పురోగతి, సవాళ్లపై చర్చిండానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎస్‌ఐఆర్`సెంట్రల్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చి (మైసూర్) మాజీ ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లలితా గౌడ్ మాట్లాడుతూ, ముడి పదార్ధాల నుండి తుది ఉత్పత్తుల వరకు ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి దశలోనూ ఆహర ఉత్పత్తుల ప్రామాణికతను నిరూపించడం వినియోగదారులకు, పరిశ్రమలకు ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు. ఎక్కువ వాణిజ్య విలువ కలిగిన ఉత్పత్తులు ఆర్ధిక కల్తీ, తప్పుడు లేబులింగ్ నాణ్యతా లోపాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. యుఎస్.ఫార్మాకోపియా ఫుడ్ ప్రాడ్ డెటాబేస్ ప్రకారం ప్రపంచంలో పాలు, ఆలివ్ ఆయిల్, తేనె ఎక్కువగా కల్తీకి గురవుతున్నాయని, ఆహర కల్తీని సులభంగా గుర్తించడానికి పరిశోధకులు ఎఐ, డీప్ లెర్నింగ్ సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

గీతం ప్రో`వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ విద్యార్ధులు, పరిశోధకులు ఆహర ప్రోసెసింగ్ రంగాన్ని ఎంచుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఎన్‌ఐఎఫ్‌టిఇఎమ్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆర్.మహేంద్రన్ వ్యవసాయ ఆహర ఉత్పత్తులలో సూక్ష్మజీవులను తగ్గించడం, విత్తనాల శుద్ది, అంకురోత్పత్తి పెంపు, ధాన్యాలలో క్రిమిసంహరక నియంత్రణకు కోల్డ్ ప్లాస్మా సమర్ధవంతంగా పనిచేస్తుందని వివరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, మట్టి సంరక్షణ మరియు డిజిటల్ సాంకేతికంత ద్వారా పంట దిగుబడిని పెంచవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ సి.కవిత, లైఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ నీరజ్‌కుమార్ మిశ్రా, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ ఆహర దినోత్సవం సందర్భంగా సదస్సులో పాల్గొన్న విద్యార్ధులు గీతం ఆవరణలో వాకథాన్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్