ప్రజాశక్తి- టెక్కలి రూరల్
అంతర్ కళాశాలల బాక్సింగ్ పోటీల్లో టెక్కలి ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారని డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో రఘు ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యాన నిర్వహించిన 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంతర్ కళాశాలల–విశ్వవిద్యాలయ బాక్సింగ్ జట్టు ఎంపికల్లో విద్యార్థులు పతకాలు సాధించినట్లు తెలిపారు.
ఈ పోటీల్లో ఇసిఇ తృతీయ సంవత్సరం విద్యార్థి పి.దుర్గాప్రసాద్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థిని బొడ్డ గేయామృత స్వర్ణ పతకాలు సాధించారు. ఐటి తృతీయ సంవత్సరం విద్యార్థి ఎస్.సంపత్ వినాయక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థి జశ్వంత్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
వీరికి డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్. శ్రీనివాసరావు, సంబంధిత విభాగాధిపతులు, వ్యాయామ విద్యా విభాగ సిబ్బంది లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి అభినందించారు.








కామెంట్‌లు (0)