శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలకు సమగ్ర భద్రతా ప్రణాళిక

23 అక్టోబర్, 2026

ఎన్నికలకు సమగ్ర భద్రతా ప్రణాళిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి వెల్లడించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలుతో పాటు జనసమూహాల నియంత్రణ, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలాస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ఆయన వెంట డిఎస్పీ సిహెచ్.ధనుంజయ నాయుడు, శ్రీకాకుళం సిఐ వై.రామకృష్ణ, వన్ టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్