శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ-వ్యర్థాల సేకరణ.. క్రీడా మైదానం అభివృద్ధి

23 అక్టోబర్, 2026

ఈ-వ్యర్థాల సేకరణ.. క్రీడా మైదానం అభివృద్ధి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కవిటి

పర్యావరణ పరిరక్షణతో పాటు క్రీడల అభివృద్ధికి విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సింహాచలం నాయుడు అన్నారు. కళాశాల విద్యార్థులు కవిటిలో ఈ-వ్యర్థాలను శుక్రవారం సేకరించారు. మరోవైపు యువజన సంఘ సభ్యులు, జెసిబి యజమాని తులసీరావు సహకారంతో కళాశాల క్రీడా మైదానాన్ని చదును చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయకుండా సక్రమంగా తొలగించాలని ప్రిన్సిపాల్ సూచించారు. మైదానం అభివృద్ధితో విద్యార్థుల్లో క్రీడాసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్