ప్రజాశక్తి సోంపేట
సోంపేట మండలం మామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ , ప్రజా సంఘాలు బలపరిచిన జుత్తు కృష్ణవేణి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు ఒకటో వార్డు మెంబర్ గా గోరకల .
మన్మధరావు, మూడో వార్డు మెంబర్ గా మర్రి లోకనాథం, ఎనిమిదో వార్డ్ మెంబర్ గా తాళపద్ర రామారావు లు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సిపిఎం, ప్రజాసంఘాలు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కే మోహన్ రావు, మామిడిపల్లి రైతు సంఘం అధ్యక్షులు సింహాచలం, మహిళా సంఘం నాయకులు మర్రి ఇందిరా, సిఐటియు నాయకులు యన్ గణపతి, పాతిన రాజు, పాతిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)